Friday, August 6, 2010

Don Seenu Review by Ganesh Ravuri

ఈ శీనుకి లేదంత సీను!  
              స్వీట్ ఇష్టమని అదే పనిగా తింటే ఏమవుతుంది? ఏదో ఒక పాయింట్లో వెగటు పుడుతుంది. అప్పటికీ ఆపకుండా ఇంకొన్ని లాగించేస్తే?
మొహం మొత్తేస్తుంది... మళ్లీ జన్మలో అది తినాలని కూడా అనిపించనంత విరక్తి వచ్చేస్తుంది. రవితేజ మార్కు సినిమాలకు, వినోదానికి ఆ వెగటు స్థాయి దాటి విరక్తి లెవల్ రీచ్ అయ్యే ప్రమాదం ముంచుకొస్తోంది. దానిని గుర్తించి అమాంతం జాగ్రత్త పడకపోతే మధ్యలో కొన్ని మంచి సినిమాలు చేసినా.. ఆవీ మూసలో పడి కొట్టుకుపోయే డేంజర్ పొంచి ఉంది.
             డాన్ శీను కూడా రవితేజ చేసిన అనేకానేక మాస్ మసాలా సినిమాలలాగా నలిగిన దారిలో నడుస్తుంది. చిన్నప్పుడు చూసిన అమితాబ్ డాన్ సినిమా ప్రభావంతో తన పేరుని డాన్ శీనుగా మార్చేసుకున్న శీను పెద్దయ్యాక పెద్ద డాన్ అయిపోదామని పట్నం వస్తాడు. అక్కడ పేరు మోసిన ఇద్దరు డాన్ లలో ఎవరో ఒకరి దగ్గర సెటిల్ అయిపోయి లక్ష్యం చేరుకోవాలని అనుకుంటాడు. అనుకున్నట్టే ఒకరి కోటలో పాగా వేసిన శీను, వాడి పగ తీర్చే పావులా మారతాడు. అంతా కరెక్టుగానే చేసానని అనుకుంటాడు కానీ తానెంత తప్పు చేసాడో తర్వాత గానీ శీనుకి తెలిసిరాదు. అసలు డాన్ శీనుకి అప్పగించిన పనేంటి? దానిని అమలు చేయడంలో ఎక్కడ తేడా జరిగింది? పర్యవసానంగా శీను ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు? వాటిని ఎలా అధిగమించాడు? 
           ఇలాంటి రొటీన్ కథల్ని రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటి రొటీన్ గానే చెప్పొచ్చు. ఇంకోటి రొటీన్ అనిపించకుండా చాతుర్యం ప్రదర్శించొచ్చు. దర్శకుడి దగ్గర అంత చాతుర్యం లేదో, కొత్తగా చెప్పేందుకు ధైర్యం చాలలేదో కానీ మొదటి దారినే ఎంచుకున్నాడు. హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత విలన్ల మధ్య వైరం చూపించడానికో సీను వాడుకున్నాడు. హెలికాప్టర్ లోంచి ఒకడిని వేలాడదీసి ఉరి తీసీ ఆ సన్నివేశం స్కార్ ఫేస్ అనే ఆంగ్ల చిత్రం నుంచి ఎత్తుకొచ్చాడు. ఇక అక్కడినుంచి ఏదో ఒక సినిమాలో చూసేసిన, ఎన్నో సినిమాల్లో చూసి బోరు కొట్టేసిన సన్నివేశాలను ఒకదాని తర్వాత ఒకటిగా తీసుకుంటూ పోయాడు. ఒకానొక దశలో ఇంటర్వల్ ఎప్పుడిస్తారో అని ప్రేక్షకులకి ఏడుపొచ్చేసే స్థాయికి విసిగించాడు, పరీక్షించాడు, హింసించాడు. ఇంటర్వల్ దగ్గరో ట్విస్ట్ ఇచ్చి ఇంట్రెస్ట్ పుట్టించినా, మళ్ళీ తన కాపీ పరిజ్ఞానాన్ని అంతా ప్రదర్శించి డాన్ శీనుతో రొటీన్ స్టెప్పులేయించాడు. కథను నడిపించడానికి, ప్రేక్షకులని నవ్వించడానికి అవసరంలేని సన్నివేశాలు ఇరికించి ద్వితీయార్థాన్ని ఇంకాస్త కంగాళీ చేసి పారేసాడు. క్లైమాక్సులో డాన్ శీను అసలు ఎందుకు వచ్చాడు. అతని అసలు లక్ష్యం ఏమిటి అన్నది చూపించాక, దర్శకుడు మలినేని గోపీచంద్ ఒక 30 ఏళ్ల క్రితం  పరిచయమై ఉంటే పరశ్రమని ఏలేసి ఉండేవాడేమో అనిపించక మానదు.
               రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పుకోడానికి ఏమీ లేదు. అలవాటయిన పాత్రలో అలవోకగా ఇమిడిపోయి అవలీలగా నెట్టుకొచ్చేసాడు. అభిమాన హీరో అమితాబ్ ని అఫీషియల్ గా అనుకరించే అవకాశం దొరకడంతో అవధులే లేకుండా అదరగొట్టేసాడు. బ్రహ్మానందం కాంబినేషన్లో అయితే రవితేజకి పగ్గాలుండవు. అదింకోసారి నిరూపిస్తూ మూగవాడిగా  నటించే సీన్లో తెగ నవ్వించాడు.
              "అందాన్ని చూడాలి చూడాలి అనిపించాలి కానీ చూసేసాం చూసేసాం అనిపించకూడదు" అని ఇందులో శ్రియతో రవితేజ అంటాడు. శ్రియని చూసేప్పుడు ప్రేక్షకులకి అలాగే అనిపిస్తుంది. ఎన్నోసార్లు చూసేసి, ఇక చూడ్డానికి ఏమీ మిగలని శ్రియ తెర మీద తేలిపోయింది.అంజనా సుఖానిని హీరోయిన్ స్నేహితురాలిగా పరిచయం చేస్తారు. నిజానికి ఈ కథలో ఆమె రెండో హీరోయిన్ అయినా కానీ చూడ్డానికి మాత్రం హీరోయిన్ చెలికత్తె పాత్రలేసే పిల్లలానే ఉంది. శ్రీహరిని మళ్ళీ మళ్ళీ అదే పాత్రలో చూడ్డానికి ఇబ్బందిగా ఉంది. సాయాజీ షిండేకి ఇలాంటివి చేయడం ఇప్పటికే అలవాటైపోయింది. మహేష్ మంజ్రేకర్ కూడా సాయాజీ మాదిరిగా అదే టైప్ క్యారెక్టర్స్ కి ఫిక్స్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. కస్తూరి చాలా కాలం తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించింది. 
             బ్రహ్మానందం ఓ రెండు సన్నివేశాల్లో పర్లేదనిపించాడు. ఆలి తన ద్వందార్ధ సంభాషణలతో శ్రుతి మించాడు.  వేణుమాధవ్ సో సో అనిపిస్తే బ్రహ్మాజీ, రఘుబాబు ఓకే అనిపించారు. ఈ మధ్య అవసరం ఉన్నా లేకపోయినా ఎవరో ఒకరితో వాయిస్ ఓవర్ చెప్పించడం ట్రెండ్ అయింది కాబట్టి జగపతిబాబుతో ఆ పని చేయించారు. 
             కోన వెంకట్ మాటలు ఏమంత గొప్పగా లేవు. మణిశర్మ పాటలదీ అదే పరిస్థితి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఒక మాదిరిగా ఉంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాతలు పెట్టిన ప్రతి పైసా స్క్రీన్ పై కనిపించడానికి కెమెరా పనితనం ఉపయోగపడింది. ఈ సినిమా మీద నిర్మాతలు అవసరానికి మించి ఖర్చు పెట్టారు. ఎలాంటి కథల మీద ఖర్చు పెట్టాలి, ఎలాంటి వాటిని అదుపులో పెట్టాలి అనేది కూడా మంచి నిర్మాత అవుదామని అనుకునే వారి లక్షణమేనని ఈ చిత్ర నిర్మాత గుర్తించాలి.
            తెలుగు సిని పరిశ్రమలో ఇప్పుడు చాలా మంది ఉన్నారు. వాళ్లకి ఇప్పుడు గోపీచంద్ మలినేని కూడా యాడ్ అయ్యాడు. అంతకు మించి ఈ సినిమాతో గోపీచంద్ కి వచ్చే గుర్తింపు ఏమీ ఉండదు. ఇలాంటి సినిమాలు తీసేసిన వాళ్ళు, తీస్తున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. అందుకోసం ఇంకో కొత్త దర్శకుడు పుట్టుకురానక్కరలేదు. ఈ టైప్ సినిమాలు తీయడానికే వచ్చినట్టయితే గోపీచంద్ గురించి చెప్పుకోడానికి ఎప్పటికీ ఏమీ ఉండదు.
             ఈ సినిమాని యావరేజ్ అన్నామంటేనే చాలా లిబెరల్ గా ఉన్నట్టు. ఇది పైసా వసూల్ అని ఎవరైనా అంటే వాళ్ళ పైసలకి విలువ లేనట్టు. డాన్ శీను సినిమా అంటూ ఒకటి వచ్చింది, వెళుతుంది. ఈ గ్యాప్ లో దానిని చూసినా చూడకపోయినా నష్టముండదు. ఇంకా చెప్పాలంటే చూస్తేనే ఒకింత టైం వేస్ట్ చేసుకున్నట్టు! చేయడానికి పనికొచ్చే పని ఏదీ లేకపోతే డాన్ శీనుని దర్శించుకోవచ్చు. అదే నిఖార్సయిన నీట్ కామెడి చూడాలనుకుంటే మాత్రం ఈ శీనుకి అంత సీను లేదు. ఎందుకంటే దీంట్లో నీట్ నెస్సూ లేదు... ఇది నిఖార్సయిన కామెడీ అంత కంటే కాదు. 

             ఊకదంపుడు సినిమాలు తీసి బి సిల వాళ్ళకి నచ్చుతుంది, మాస్ కి ఎక్కుతుంది అని స్టేట్ మెంట్స్ ఇవ్వడం మామూలైపోయింది. వాళ్ళకీ అలా టేస్ట్ లేని వాళ్ళుగా స్టాంప్ వేయించుకోవడం అలవాటైపోయింది. ఈ సినిమాతో అయినా వాళ్ళకీ టేస్ట్ ఉందని నిరూపించుకుంటారో, లేక ఎప్పటిలాగే సూసిందే సూడబుద్దేత్తందని సంబర పడిపోతారో త్వరలోనే తేలిపోతుంది.

డాన్ శీను రేటింగ్: 5 /10 

కామెంట్: రొటీన్ శీను!

                                    -గణేష్ రావూరి

16 comments:

 1. hahaha lol

  annai antha one sided ga raasinatlu undhiiii

  oka point kuda postive ga radham ane agenda lekunda saagipoyindhi mee review :)

  gopichand malineni mee review chusthe kiki feeeeeel avthadu baaga....

  :)

  -s

  ReplyDelete
 2. honest review :)

  ReplyDelete
 3. excellent review
  ammudu poni review
  public review

  ReplyDelete
 4. critic ante only vimarsale cheyyala....

  toooooooooo ni bathuku

  ReplyDelete
 5. precise review Ganesh ji.........me too felt exactly the same

  ReplyDelete
 6. Ganesh Garu...meeku maree chaadastham perigi poyindi...deppi podavdam thappa meeru emee cheyaleru...mee sontha parignyaanam vadilesi, chitram gurinchi rasthe chadivi tharistaam...

  ReplyDelete
 7. Hi...Ganesh,How r u?

  First time i came to ur site,Bit here i Have seen a Worst review by u....

  Meeru Interval eppudu vastunda ani aduru chusi edsari ani annaru....kani maku theatre lo appude interval vatchinda anipinchindi...

  Movie lo Main Minus ante MANISHARMA's MUSIC....The best worst audio, and worst screenplay for Second Half,Gopichnad malineni will have great future ahead.....

  Meeku Movies making anta baga teliste velli Meru Teeyotchu kada..

  Manchi Movies ni Leni Meanings cheppi TOLLYWOOD ni nasanam cheyoddu boss...

  ReplyDelete
 8. //స్వీట్ ఇష్టమని అదే పనిగా తింటే ఏమవుతుంది? ఏదో ఒక పాయింట్లో వెగటు పుడుతుంది. అప్పటికీ ఆపకుండా ఇంకొన్ని లాగించేస్తే?
  మొహం మొత్తేస్తుంది... మళ్లీ జన్మలో అది తినాలని కూడా అనిపించనంత విరక్తి వచ్చేస్తుంది. //

  మనకి తినడానికి అది తప్ప ఇంకోటి లేకపోతే ... అదే రవితేజ సినిమా :)
  చూసొచ్చాక కామెంట్ చేస్తా మీ రివ్యూ మీద :D

  ReplyDelete
 9. "Meeku Movies making anta baga teliste velli Meru Teeyotchu kada.."

  Ganesh s job s to write reviews nt to make d movies....he cant rate best for the worst movies...Hoinest ga raasina daanine review antaru..ammudupoyi raasina daanini kaadu..Arun

  ReplyDelete
 10. Ganesh sir i belive ur reviews...cheers...Arun 9246935806

  ReplyDelete
 11. గణేష్ ... సినిమా చూసొచ్చా .... మీ ఫ్రస్ట్రేషన్ లో ఇసుమంతయినా తప్పు లేదు ... చివరి అరగంటా బయటకొచ్చేసా భరించలేక ... అదన్నమాట ...

  ReplyDelete
 12. yes ganesh you are 100% correct don seenu is nothing but a routine mass cinema nohting much to speak about it

  ReplyDelete
 13. HI, Mee reviews neenu Andhracafe lo chadive vaadini, ee madhya andhulo updates leka pothey chaala disturb ayyanu.. meeru reviews baaga rastaaru..
  good keep it up..... meeru anukunnadhi frank ga raayandi, evado edho annadani feel avvoddu

  ReplyDelete
 14. neninka movie chudaledu .. but i lyk ur reviews .. used to read them on andhracafe :)

  ReplyDelete
 15. hello vihari and spandana garu... review ki yentha amount collect chestunnav..

  ReplyDelete