Saturday, May 29, 2010

ఏమిది జగన్నాధా?



పోకిరి సినిమాకి ముందు పూరి జగన్నాధ్ పనైపోయిందనే అనుకున్నారు పరిశ్రమ వాసులంతా. ఆంధ్రావాలా, 143 దెబ్బకి పూరి కొట్టు కట్టెయ్యడం ఖాయమని అతనంటే పడని వాళ్ళు పండగ చేసుకున్నారు. అయితే ఒకే ఒక్క పోకిరితో వాళ్ళ నోళ్ళు మూయించడమే కాకుండా పరిశ్రమ రికార్డులన్నీ బద్దలు కొట్టి అవతలేసాడు. పోకిరి లాంటి హిట్టిస్తే ఇక మల్లి ఇంకో విజయం కోసం పూరి నిరీక్షించక తప్పదని కొందరు సంబర పడితే, దేశముదురు, చిరుత రూపంలో రెండు రీజనబుల్ హిట్స్ ఇచ్చి డైరెక్టర్ గా తన నంబర్ వన్ స్థానాన్ని నిలుపుకున్నాడు. కానీ ఆ తర్వాత ఏమయిందో పూరి మ్యాజిక్ పని చేయడం మానేసింది! బుజ్జిగాడు చచ్చీ చెడీ ఏవరేజ్ ముద్ర వేయించుకుంటే, నేనింతే దారుణంగా బాల్చీ తన్నేసింది. ఆ తర్వాత వచ్చిన ఏక్ నిరంజన్ పూరి కెరీర్లో మరో మచ్చగా మిగిలింది. ఈ నేపధ్యంలో వచ్చిన తాజా చిత్రం గోలీమార్ అయినా మళ్ళీ పూరిని తిరిగి ట్రాక్ మీదకు తెస్తుందని అనుకుంటే, షరా మామూలుగా గోలీమార్ కూడా ఒక మామూలు సినిమాగా ఎవరి మెప్పునీ పొందలేక పోతోంది. పూరి ఆర్ధికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడని, దీనికి తోడు అపజయాలు అతడిపై ఒత్తిడిని అధికం చేస్తున్నాయని సినీ వర్గాలు అంటున్నాయి. అయితే ప్రేక్షకులకి ఒకరి పర్సనల్ కష్టాలు పూర్తిగా అనవసరం. వాళ్ళు పెట్టిన ఫిఫ్టీ రుపీస్ కి ఎంత గిట్టుబాటు అయిందన్నదే వాళ్లకి అవసరం. కనుక పూరికి పర్సనల్ కష్టాలున్నా, ఇంకే నష్టాలు జరిగినా వాళ్ళు కనికరించి ఒక సినిమాను హిట్ చేయరు. ఇప్పుడు హిట్టు కొట్టాలంటే పూరి తన ఇబ్బందులన్నీ పక్కన పెట్టి పక్కా స్క్రిప్టుతో రావాల్సిందే. జనం జగన్నాధుని లైట్ తీసుకోకూడదంటే ఇంకో సారి గట్టిగా బాక్సాఫీసు బద్దలవ్వాల్సిందే. అది పూరి నెక్స్ట్ సినిమాతోనే జరుగుతుందని ఆశిద్దాం.

Click here for Golimaar Review

1 comment:

  1. గణేష్ నా వ్యూస్‌తో మీ రివ్యూస్ సరిగ్గా సరిపోతాయి. మీ ఒక్కరి రివ్యూనే నేను consider చేస్తాను. మీ గోలీమార్ రివ్యూ చదివాను అయినా మిత్రుల ఒత్తిడితో సినిమాకి వెళ్ళక తప్పిందికాదు. సినిమా గురించి రెండు ముక్కల్లొ చెప్పాలంటే, సినిమా ఇంతకుముందే చూసినట్టు అనిపించింది, మెత్తానికి నరకం చూపించారు.

    గత మూడు సంవత్సరాల నుండి తెలుగు సినిమాలు చూస్తున్న నాకు రోజు రోజుకూ, సినిమా సినిమాకి కొన్ని విషయాల్లో క్లారిటీ మాత్రం వస్తుంది, ప్రతి వారం వంద రూపాయలు, కొన్ని గంటల సమయాన్ని ఖర్చు చేసి నేను పొందింది ఆనందంకాదు తలనొప్పి అని. తెలుగు పరిశ్రమ కొత్త ప్రయోగాలు చేయదు, హిట్ అయిన ఒక సినిమాను తీసుకొని దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళి తీస్తారని, ఇలా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కాని సమయం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం.

    మెత్తానికి ఈ సినిమ అయినా బాగుండకపోదా అని ప్రతీ ఆదివారం అనుకునే నాకు సంవత్సరం మెత్తంలో మూడు నాలుగుసార్లు తప్ప ఎప్పుడూ ఎదురుచుక్కే, ఏం చేస్తాం నా(మన) ఖర్మ.

    ReplyDelete