Monday, May 31, 2010

వేదం కనెక్షన్ కట్ అయితే అంతే!


కుర్ర హీరోల్లో కనీసం అరడజను సినిమాలు చేసిన వారిలో అత్యధిక విజయాల శాతం ఉన్న వాడిగా ఘనత వహించిన అల్లు అర్జున్ ఇపుడా క్రెడిట్ కోల్పోయే ప్రమాదంలో చిక్కుకున్నాడు. దేశముదురు బ్యాడ్ టాక్ తోనే ఆడేసినా, పరుగుకి దిల్ రాజు హ్యాండు కలిసొచ్చినా, ఆర్య 2 మాత్రం అతడిని డిఫెన్సులోకి నెట్టింది. వరుడు అయితే నిట్ట నిలువునా ముంచింది. ఏడాదికి ఒక్క సినిమా చేసుకునే రోజుల్లో బన్నీ బాబుకి పాపం ఈ చిక్కుల్లేవు. వేగం పెంచి సినిమా తర్వాత సినిమా ఆపకుండా వదుల్తుంటే ఇదిగో ఇలా మొదటికే మోసమొచ్చింది.
ఈ తరుణంలో బన్నీ నటించిన వేదం విడుదలకి సిద్ధమయింది. ఇదేమో ప్రయోగాత్మక చిత్రం. పరిస్థితి ఏంటో, ఫలితం ఎలా ఉంటుందో సినిమా విడుదల అయితే గానీ తెలీదు. విజయాల పరంపర సాగిస్తున్న సమయంలో వేదం వచ్చి, అది అటు ఇటు అయినా బన్నీకి అది పెద్ద సమస్య కాకపోవచ్చు కానీ, పరజయాల్లో ఉన్న ఈ టైంలో వేదం ఏమాత్రం తేడా కొట్టినా బన్నీ ఖాతాలో హ్యాట్రిక్ ఫ్లాప్స్ అని మీడియా హంగామా చేసేస్తుంది. పైగా నెమ్మదిగా సినిమాలు చేసుకున్నపుడే మన టైం బాగుందని బన్నీకి అనిపించినా అనిపిస్తుంది. దాంతో ఆటోమేటిగ్గా అతని సినిమాల సంఖ్య తగ్గుతుంది. బోనస్ గా వేదం లాంటి ప్రయోగాలంటే మిగిలిన వారికి మరింత భయం పెరుగుతుంది. ఫైనల్ గా మళ్ళీ మనం ఆ పాత చింతకాయ, ఓల్డు వైనూ లాంటి సినిమాలే మళ్ళీ మళ్ళీ చూడాల్సి వస్తుంది. అబ్బో... వేదంతో చాలా వాటికే కనెక్షన్స్ ఉన్నట్టున్నాయి. ఇది పొరపాటున ఆఫ్ అయితే అవన్నీ మటాషే అనిపిస్తుంది. జూన్ 4న విడులవుతున్న వేదం పైన వ్యక్తం చేసిన డౌట్స్ అన్నిటికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చేస్తుంది.

No comments:

Post a Comment