Monday, May 31, 2010

కబ్జా చేస్తున్న అన్నదమ్ములు!



తెలుగు వాళ్ళకి ఉన్నంత విశాల హృదయం తమిళ సోదరులకి ఉండదు. అందుకే తమిళ సినిమాలు మన భాషలోకి డబ్ అయిన రేంజ్ లో మనవి అక్కడికి ఎగుమతి కావు. ఇప్పుడిప్పుడే తమిళ మార్కెట్ ని కొల్లగొట్టాలని మన హీరోలు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు కానీ మన వాళ్ళ ఆటలు సాగి, ఆశలు నిలబడతాయా అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్ధకమే!
అయితే మన ఓపెన్ మైండ్ సెట్ ని మాబాగా ఎన్ కాష్ చేసుకుంటున్నారు తమిళ హీరోలు. ఇప్పటికే తెలుగు నాట మంచి మార్కెట్ తెచ్చుకున్న సూర్యనే తీసుకుంటే, కేవలం తాను మాత్రమే కాకుండా లేటెస్ట్ గా తమ్ముడు కార్తిని కూడా రంగంలోకి దించాడు. యుగానికి ఒక్కడు, ఆవారా సినిమాలతో కార్తి తెలుగులో స్థిరపడుతున్నట్టే కనిపిస్తున్నాడు. పైగా... అన్న గారికి లేని అదనపు అడ్వాంటేజ్ ఇతగాడికి ఉంది. అదే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం. దీనిని సూర్య తన తదుపరి తెలుగు అనువాదంలో అనుకూలంగా మార్చుకుంటున్నాడు. సూర్య నటించిన తమిళ చిత్రం సింగంకి తెలుగు అనువాదమయిన యముడు సినిమాలో సూర్య పాత్రకి కార్తి డబ్బింగ్ చెప్తున్నాడట!! ఇలా అన్నదమ్ములు ఒక అండర్ స్టాండింగ్ తో తెలుగు మార్కెట్ ని కొల్లగొట్టడం చూసి అయినా మన వాళ్ళు పక్కింట్లోకి జొరబడి, అందినంత లాక్కోవడమెలాగో నేర్చుకోవాలి.

No comments:

Post a Comment