మొన్న జరిగిన స్టార్ క్రికెట్ మ్యాచ్ లో అక్కినేని అఖిల్ హీరో అయితే నందమూరి తారకరత్న
విలనయ్యాడు. అమరావతి సినిమాలో వేసిన విలన్ వేషం ఇంకా అతడిని వెంటాడుతుందో ఏమో మరి? సరదాగా ఆడుతున్న క్రికెట్ అని కూడా లేకుండా ఏదో పాకిస్థాన్ ఆటగాడిలా చిన్న పిల్లోడైన రాఘవేంద్ర మీద రెచ్చిపోయాడు. ఆపకుండా ఇండెక్స్ ఫింగర్ చూపిస్తూ ఆంగ్లేయుల ఫేవరెట్ బూతుని పదే పదే పలికాడు. కావాలని తప్పు వేలు చూపించాడో లేక నిజంగానే పాపం రత్నానికి ఏ వేలు చూపించాలో తెలీదో తెలీదు మరి.
అయినా అంతా మామూలుగా ఆడుతున్న ఆటని రత్నం ఎందుకంత సీరియస్ గా తీసుకున్నాడనేది ఎవరికీ అంతు బట్టడం లేదు. గ్రౌండ్లో తారక రత్న చూపిన ప్రతిభ మాత్రం మెచ్చుకోవాలి. మరీ ప్రొఫెషనల్ క్రికెటర్ లా కాకపోయినా చాలా మంది కంటే బాగా ఆడాడు. అసలు తారక రత్న ముందే క్రికెట్ ని సీరియస్ గా తీసుకుని ఉంటే హీరోగా ఇన్ని అపజయాలు, ఆపసోపాలు తప్పేవేమో మరి. అయినా తప్పంతా చిన్న ఎన్టీఆర్ దే అనాలి. అతను క్రికెటర్ అయి వన్డే ఆడి ఉంటే ఆ రికార్డు కొట్టడానికి తారకరత్న కూడా క్రికెటర్ అయి ఒకే రోజు తొమ్మిది వన్డేలు ఆడి ఉండే వాడేమో! .
అయినా తప్పంతా చిన్న ఎన్టీఆర్ దే అనాలి. అతను క్రికెటర్ అయి వన్డే ఆడి ఉంటే తారకరత్న ఒకే రోజు తొమ్మిది వన్డేలు ఆడి ఉండే వాడేమో! //
ReplyDeleteROFL
//కావాలని తప్పు వేలు చూపించాడో లేక నిజంగానే పాపం రత్నానికి ఏ వేలు చూపించాలో తెలీదో తెలీదు మరి. //
ReplyDeleteLOLLLLL