తెలుగు సినిమాకి మంచి రోజులు వస్తున్నట్టే కనిపిస్తోంది. గతంలో కంటే ప్రయోగాలు చేయడానికి ఇప్పుడు కొంత మంది దర్శకులు తెగువ చూపుతున్నారు. రొటీన్ కి భిన్నంగా ప్రయత్నించడానికి కొందరైనా ముందుకొస్తున్నారు. ఇది శుభ పరిణామం అనే అనాలి. ఈ ఏడాదిలో ప్రస్థానం, వేదం వంటి ఆఫ్ బీట్ సినిమాలు వచ్చాయి. అఫ్ కోర్స్ వాటిని ఆదరించే స్థాయికి ఇంకా మన ప్రేక్షకులు ఎక్కువ మంది ఎదగలేదు అనుకోండి. అది వేరే విషయం. ఎట్ లీస్ట్ ప్రయత్నలోపం లేకుండా, ఫలితం ఏమవుతుందో లెక్కించుకోకుండా కొందరైనా ధైర్యంగా ముందడుగేస్తున్నారు. మొదలంటూ పెడితే ఎక్కడో ఒక చోట మార్పు తప్పక తీసుకు రావొచ్చు కనుక ఇలా సాహసిస్తున్న వారందరినీ తప్పక వెన్ను తట్టి ప్రోత్సహించాలి.
ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగు చిత్ర సీమలో ఎదురులేని దర్శకుడిగా దూసుకుపోతున్న రాజమౌళి త్వరలో ''ఈగ'' అనే ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఈగ ప్రధాన పాత్ర పోషిస్తుందని. ఈగ చుట్టూ ఈ చిత్రం తిరుగుతుందని వార్తలొస్తున్నాయి. గ్రాఫిక్స్ ప్రధానంగా రూపొందే ఈ చిత్రం తెలుగు చిత్ర సీమలో సరికొత్త విప్లవానికి తెర తీస్తుందనే ఆశిద్దాం. రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ ఇలాంటి ప్రయోగానికి పూనుకుంటే అతని కోవలో మరింత మంది పంథా మార్చుకునే అవకాశముంది. అలాగే రాజమౌళి వంటి మాస్ మెచ్చిన దర్శకుడి పేరు ఒక ప్రయోగానికి జతైతే మన మాస్ ప్రేక్షకుల్లో కూడా కొత్తదనాన్ని ఆదరించే గుణం ఎంతో కొంత పెరిగే ఆస్కారముంటుంది.
edi oka news aa mr.Raaavuri,
ReplyDeleteviishayam takkuva sodha yekkuva
i never expected this type of news ..
ee madhyaa yekkuvaa serials chusthunnaraa
Regs
bhagavatula
hehehehe
ReplyDelete