పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికే ఎంతో రాటుదేలిపోయారు. దాదాపు దశాబ్ద కాలంగా తమ హీరో పద్ధతికి అలవాటు పడిపోయారు. కాబట్టి ఈ న్యూస్ వారికంత
బాధ కలిగించకపోవచ్చు. ఓస్ అంతే కదా మాకు అలవాటేలే అనుకోవచ్చు. కానీ ఎంత కాదన్నా లోలోపల కొంచెం గుచ్చుకోవచ్చు.
అదిగో పులి అంటూ చిన్నప్పుడు చదివిన కథలా 'కొమరం పులి' అదిగో వచ్చేస్తోంది, ఇదిగో ఇక్కడే ఉంది అని ఇప్పటికే చాలా వార్తలొచ్చాయి. డై హార్డ్ పవన్ ఫాన్స్ కూడా నిజంగా పులి వచ్చినా నమ్మలేని పరిస్థితి నెలకొంది. అంతగా ఊరించి ఊరించి విసిగిస్తున్న పులి జులైలో వచ్చేస్తోందని ఈ మధ్య బలంగా వినిపించింది. కానీ ఆగస్టులో కానీ పులి బయటకు రాదని కొత్తగా వినవస్తోంది.
అయితే ఈ ఆలస్యానికి లేట్ లతీఫ్ గా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ ని తప్పు పట్టడానికి ఏమీ లేదంట. అతని పని మొత్తం అయిపోయినా ఇంకా రెహ్మాన్ దయ చూపట్లేదంట. తొందరలో ఆయన కరుణించినా, వచ్చే నెలలో తెలంగాణాలో ఉప ఎన్నికలున్న కారణంగా పులి విడుదలలో మరింత జాప్యం అనివార్యమని అంటున్నారు. అయితే ఇంకా ఇది అధికారికంగా ధృవీకరించలేదు. అయినా అధికారికంగా ప్రకటించడానికి పాపం నిర్మాత శింగనమల రమేష్ కి అయినా ఏమైనా తెలిస్తే కదా అంటారా? అదీ నిజమే! ఒకేసారి పవన్, మహేష్, త్రివిక్రమ్, రెహమాన్ వంటి స్పీడ్ స్టర్స్ తో రన్నింగ్ కి దిగినపుడు ఈమాత్రం ఆయాసం సహజమే!
No comments:
Post a Comment