Thursday, June 17, 2010

క్రిష్ తదుపరి సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్స్

గమ్యం, వేదం సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకుని, తాను అందరిలాంటి దర్శకుడిని కాదని, తన మార్గం, గమ్యం వేరని చాటుకున్న క్రిష్ తన తదుపరి చిత్రం కూడా
వేదం చిత్రాన్ని నిర్మించిన ఆర్కా మీడియా వారికే చేస్తాడని సమాచారం. అయితే క్రిష్ కానీ, ఆర్కా మీడియా కానీ ఇంకా ఈ సంగతిని ప్రకటించలేదు. 
క్రిష్ మలి చిత్రం ఏదనేది ఇంకా తేలకపోయినా రెండు ఆసక్తికరమయిన టైటిల్స్ క్రిష్ సొంత బ్యానర్ పై, ఆర్కా మీడియా బ్యానర్ పై కొత్తగా రిజిష్టర్ అయ్యాయి. 

క్రిష్ ఓన్ బ్యానర్ అయిన ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్ మెంట్ పేరు మీద 'అ' అనే టైటిల్ రిజిస్టర్ అయింది. అలాగే ఆర్కా మీడియా పేరు మీద 'జనగణమన' టైటిల్ రిజిస్టర్ చేసారు. ఈ రెండిట్లో క్రిష్ ముందుగా ఏది మొదలు పెడతాడో వేచి చూడాలి. 

No comments:

Post a Comment